Wednesday, February 8, 2017

జాలంతో జలకాలాటలు



1.     సాలీడు పట్టు దారాలతో గూడు కట్టుకుంటుంది,
దారేపోయే కీటకాలను ఆకట్టుకోవాలని
దొరికిన వాటిని దొరికినట్టే బలమైన బంధాలతో బంధించి
తన కడుపు నింపుకుంటుంది.


2.     అంతర్జాలం ఎవరి కడుపూ నింపదు
కానీ తను లేకపోతే బతకలేమన్న మిథ్యను సృష్టిస్తుంది
కొన్ని సౌకర్యాలని ఇచ్చినట్టే ఇచ్చి తన మత్తులో బంధించి
తన డబ్బు పెంచుకుంటుంది.

3.     గూడులో చిక్కని కీటకాలున్నాయ్
జాలంలో చిక్కని మనుషులున్నారు
మొదటివి బతికి పోతున్నాయ్
రెండవ వారు వెనుకబడిపోతున్నారు.

4.     అంతర్జాలంలో అడుగిడితే మరణమే శరణమా?
జాలంతో జలకాలాడి బాగుపడిన వాళ్ళున్నారు.
సాలీడు పట్టుతో దుర్భేద్యమైన వస్తువులు తయారు చేసే రోజులివి
జాలంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన తరుణమిది.

5.     ఓ మనిషీ, జాలంలో ఈత నేర్చుకో
జాలంతో జలకాలాడు
తద్వారా జ్ఞానాన్ని పెంచుకో
నలుగురికీ మేలు చెయ్యి
శభాష్ అనిపించుకో!


***

No comments: