Tuesday, April 25, 2017

వాలుజడ


వాలుజడ

1.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
బుసబుసలాడే నల్లత్రాచు పెంచుకున్న ప్రబంధ కన్య

2.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
‘భామనే, సత్యభామనే’ అని దర్పంతో తిప్పే కూచిపూడి నర్తకి
3.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
సీతమ్మ వారి బంగారు జడ, జడగంటలు
4.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
అచ్చమైన పదహారణాల తెలుగు ఆడపడుచు
5.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
బాపు బొమ్మ, బాపు సినిమాల్లో నాయిక
6.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
రీటా తలనూనె
7.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
కార్తిక షాంపూ
8.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
దాన్ని పెంచడం కోసం వదిలించిన పేలు, చుండ్రు
9.     వాలు జడంటే గుర్తుకొచ్చేది
దాన్ని పెంచడం కోసం కొట్టించుకున్న గుళ్ళు
10.                        వాలు జడంటే గుర్తుకొచ్చేది
దాన్ని పెంచడం కోసం తయారు చేసిన మందార నూనె, నల్లబారిన చేతులూ
11.                        వాలు జడంటే గుర్తుకొచ్చేది
చిన్నప్పుడు వేసుకున్న పూలజడలు
12.                        వాలు జడంటే గుర్తుకొచ్చేది
ఏమరుపాటుగా విసిరినప్పుడు పక్కవాళ్ళకు తగిలిన దెబ్బలు, నా పక్కన కూర్చోనన్న మా అన్నలు
13.                        అటువంటి ఓ వాలు జాడా!
నువ్వెక్కడ? నీ ఒడ్డూ, పొడుగూ సవరాలు, విగ్గులకే పరిమితమా?
14.                        వాలు జడ వేసుకున్న ఆడపిల్లలెక్కడ?
జడ వెయ్యడానికి అమ్మలకి, ఆయాలకీ తీరికెక్కడ?
15.                        సివంగిలా జుట్టు విరబోసుకునే అమ్మాయిలు
అబ్బాయిల్లా జుట్టు కత్తిరించుకునే నారీమణులు
16.                        స్టైల్ పేరిట మన సంస్కృతిని తిరస్కరించే
వీళ్ళకేం తెలుసు వాలుజడ అందం?
17.                        వాళ్ళని తీసి పారెయ్యకండి
భార్యలని వేధించే భర్తల చేతిలో వాలు జడ ఒక పరికరమైతే,
ఆడువారిని అవమానించడానికి జుట్టు కత్తిరించడం ఒక ఆయుధమైతే,
వాళ్ళు మాత్రం ఏం చేస్తారు?
ఎప్పుడు మగవారు స్త్రీలని గౌరవిస్తారో అప్పుడే వాలు జడ తిరిగొస్తుంది!

*******

No comments: