చిట్టి కథ : చెయ్యి పట్టి
బతిమాలుతున్న అతని చేతిని విసిరికొట్టి, వెళ్ళిపోయిన ఆమెను,
అతను
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
మనస్పర్థలు
వాసంతి, ఋతురాజ్ లకి పెళ్ళయ్యి
ఏడాది కావస్తోంది. వాళ్ళిద్దరూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టి
అప్పుడప్పుడు మాటా మాటా పెరగడం జరిగిపోతూ ఉండేది. కొంత సేపటికి ఇద్దరూ
సర్దుకుపోయేవారు. పెళ్ళి రోజుని ఇద్దరూ ఏకాంతంగా వాళ్ళింట్లోనే గడుపుదామని
ఆశపడ్డారు. కానీ, ఆ రోజు పొద్దున్నే ఋతు వాళ్ళ బాస్ నుండి ఫోన్ వచ్చింది. ఆనివర్సరీ
విషెస్ చెప్పదనికేమో అని ఫోన్ ఎత్తాడు. తీరా చూస్తే, అమెరికన్ క్లైంట్ ఏదో బగ్ ని
ఫిక్స్ చేయమని కోరారట. అది ఆఫీసులో ఋతు తప్ప మరెవరూ చేయలేని పణత. ఆఫీసుకి రమ్మని
కోరాడు.
వెళ్ళక తప్పుతుందా? ‘జస్ట్ రెండు గంటలు’, అని వెళ్ళినవాడు సాయంత్రం దాకా
దయచేయలేదు. వాసంతి అన్నం ముట్టలేదు. ఇంటికి వచ్చిన భర్త సారీ చెప్తున్నా తనకి కోపం
తగ్గలేదు. అతను ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. వాసంతి చేతిని తన చేతిలోకి
తీసుకుని ఏదో చెప్పబోతే, చెయ్యి పట్టి బతిమాలుతున్న అతని చేతిని
విసిరికొట్టి, ఆమె వెళ్ళిపోయింది. అతను అటుకేసే నిస్సహాయంగా
చూస్తూ ఉండిపోయాడు. ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయి, ఏడవసాగింది. అతను వెంటనే
మొబైల్ తీసి ఒక మెసేజ్ పెట్టాడు. కాస్సేపటికి తలుపు తెరుచుకుంది. వాసంతి వచ్చి
సారీ చెప్పింది. వాళ్ళ మధ్య మనస్పర్థలు సూర్యుడు తాకిన మంచు బిందువుల్లా
కరిగిపోయాయి. మెసేజ్
ఏమిటంటే, “సారీ డియర్, అది చాలా క్లిష్టమైన బగ్. అందుకే ఇంత లేట్ అయ్యింది. నువ్వు
నేను లేకుండా భోజనం చేసుండవని తెలుసు. నీలో సగాన్నైన నేను ఎలా చేసుంటాననుకున్నావు?
మా వాళ్ళు నా చేత కేకు కోయించి పార్టీ చేసుకున్నా, నేను మంచినీళ్ళు తప్ప ముట్టలేదంటే
నమ్ముతావా?” అని. భర్త ఇంత కష్టపడి పని చేస్తూ కూడా తనకోసం కడుపు మాడ్చుకున్నాడంటే
ఏ భార్య మాత్రం బాధ పడదు?
***
No comments:
Post a Comment