తెలుగుని అంతర్జాతీయ భాషగా
మార్చాలంటే...
1. పరభాషని తెలుగులో మిళితం
చేసి గొప్పగా మాట్లాడితే సరిపోదు
తెలుగులో వాక్శుద్ధి,
వ్రాతశుద్ధి ఉండాలి.
2. భాషాభిమానం మాతృభాషపై ఉంటే
చాలదు
మిగతా భాషలపై గౌరవం ఉండాలి.
3. భాషాజ్ఞానం మాతృభాషకి
పరిమితమైతే చాలదు
కనీసం కొన్ని అంతర్జాతీయ
భాషలనైనా క్షుణ్ణంగా అభ్యసించాలి.
4. అంతర్జాతీయ భాషల పరిజ్ఞానముంటే
సరిపోదు
ఆయా భాషలలోని మంచితనాన్ని
తెలుగులోకి తీసుకువచ్చి తెలుగును చైతన్య పరచాలి.
5. అంతర్జాతీయ భాషల
చైతన్యాన్ని తెలుగులో ఇనుమడిస్తే సరిపోదు
ఆయా భాషలలో తెలుగు తీయదనాన్ని
కొనియాడగలగాలి.
6. తీయనైన, తేటతేట తెలుగుని
ఆకాశానికెత్తితే సరిపోదు
తెలుగునభ్యసించే
ఉత్సాహాన్ని అంతర్జాతీయులలో ఇనుమడించాలి.
అందుకే.....
తెలుగులో పండితుడవనిపించుకోవోయ్
తెలుగోడా!
భాష సంస్కృతిలో భాగమని
గుర్తుంచుకోవోయ్ తెలుగోడా!
మంచి సంస్కారాలను పాటించి
నలుగురి మన్ననలను పొందవోయ్ తెలుగోడా!
నాలుగు దేశాలు తిరిగి
నలుగురి మంచినీ అలవారచుకోవోయ్ తెలుగోడా!
ఆయా ప్రదేశాలలో
సత్ప్రవర్తనతో మన భాషామాధుర్యాన్ని పంచావోయ్ తెలుగోడా!
తియ్యటి, కమ్మటి మన
మాతృభాషని అంతర్జాతీయం చేయవోయ్ తెలుగోడా!
***
No comments:
Post a Comment