1.
పేదరికం ఎరుగని ఓ తల్లిదండ్రులారా!
పేదరికం
ఎంత నికృష్టమైనదో తెలుసా?
తిండికి
మొహం వాచిన వారిని చూసి మొహం తిప్పుకుంటే చాలదు
లాప్టాప్
తో ఆడుకునే మీ చంటాడికి కొన్ని చూపండి
ఆడుకోవలసిన
వయసులో వయసుకి మించిన భారాలు మోసే పిల్లలను,
ఎడ్లని
మేపే చంటాళ్ళను, బాల కార్మికులై పొట్ట పోసుకునే వారిని-
వీరందరినీ
లాప్టాప్ లో చూపి పేదరికం విలువ నేర్పండి,
మీరు
పేదలు కానందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పండి.
2. అవీ- ఇవీ లేవని మారాం చేసే మీ గారాల పట్టికి
రైలు పట్టాల మీద కూర్చుని, నవ్వే పిల్లల చిత్రం చూపండి
కంకర్రాళ్ళ బంతులతో, విరిగిన కర్రలతో సంతోషంగా
క్రికెట్ ఆడే పిల్లల చిత్రాలు చూపి సంతోషం నిర్వచనం నేర్పండి
సంతోషమంటే భౌతిక సౌఖ్యాల్లోను, వస్తువుల్లో లేదని,
మన మనస్సులలో ఉందని తెలియజెప్పండి.
తద్వారా పేదరికం విలువ నేర్పండి,
మీరు పేదలు కానందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పండి.
3. సరిగ్గా తినకుండా పొరుగింటి పుల్లకూర కోసం తాపత్రయపడే మీ మొండి ఘటానికి
ఆకలికి అలమటించే పిల్లల గురించి విశదపరుస్తూ, అంత దీనావస్థలోనూ
డబ్బున్న వాళ్ళలో లేని పంచుకునే గుణం వారిలో ఉన్న విశేషాన్ని చెప్పండి.
మీ పిల్లల వయసు వాళ్ళు యాచించకుండా చేసే సత్కార్యమేమైనా తలపెట్టండి
అందులో మీ పిల్లకాయలను భాగస్వాములను చేయండి.
ఉన్నది పంచుకుంటే ఉండే సంతోషం ఎంత ఉన్నతమైనదో బోధపరచండి.
తద్వారా పేదరికం విలువ నేర్పండి,
మీరు పేదలు కానందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పండి.
***
No comments:
Post a Comment