Wednesday, April 12, 2017

గిజిగాడిని చూసి నేర్చుకో



1.     దేవుడు అమర్చిన ఈ పచ్చని ప్రపంచంలో అత్తగారిలా వేలు పెట్టే ఓ మానవుడా!
చెత్త పెంచడం నీకు తెలుసు, నీ చెత్తని మంచికి వాడడం గిజిగాడికి తెలుసు.


2.     ఎండలో, వానలో, చలిలో నీ సౌఖ్యం కోసం వాతావరణాన్ని కలుషితం చేసే ఓ మనిషీ!
అన్ని ఋతువుల్లోనూ హాయిగా ఉండగలిగే గిజిగాడు గూడు కట్టి పర్యావరణాన్ని రక్షిస్తోంది, దాన్ని చూసి నేర్చుకో!

3.     అల్లికలలో జిగిబిగిలు నేర్చుకుని కృత్రిమ బట్టలను తయారు చేసే ఓ నిపుణుడా!
సేంద్రీయ పద్ధతిలో గూడునల్లే గిజిగాడితో పోటీ పడి గెలవగలవా?

4.     దేహదారుఢ్యంలో రకరకాల పోటీలు పెట్టి సంతోషించే ఓ ప్రేక్షకుడా!
బుద్ధి బలం ఎంత గొప్పదో ఆ చిట్టి గిజిగాడి నుండి నేర్చుకో!

5.     అత్యంత తెలివి గలవాణ్ణని మిడిసి పడే ఓ ఆహంకారీ!
మీ మనుషుల్లో ఎంతమంది తలపై గూడు లేక అలమటిస్తున్నారో! గూడు లేని గిజిగాడిని చూశావా?


6.     పర్యావరణాన్ని నీ అవసరాల కోసం మలిన పరిచే స్వార్థపరుడా!
నువ్వు అంతరింప జేసే చిట్టి జీవరాశులు నిన్ను కూడా అంతరింపజేస్తాయని తెలుసుకో!

7.     పిట్ట కొంచెం, గూడు ఘనమని గుర్తుంచుకో!
ఎన్నో విలువైన పాఠాలను గిజిగాడి నుండి నేర్చుకో!
నిన్ను నువ్వు కాపాడుకో!


*****

No comments: