1.
భవిష్యత్తులో రైతన్న హలం పట్టడు
బలరాముడికి
బదులు బండి (ట్రాక్టర్)కి మొక్కుతాడు.
2.
భవిష్యత్తులో రైతన్నకి కుప్ప నూర్చడానికి
మనుషులు దొరకరు (ఆశతో పట్నం పోతారుగా)
యంత్రాలతోటే
ఆ పనీ కానిచ్చెయ్యాలి.
3.
భవిష్యత్తులో రైతన్న వానలపై ఆధారపడడు
తక్కువ నీళ్ళతో
ఎక్కువ పంట దిగుమతయ్యే విధానాల మీద ఆధారపడతాడు.
4.
భవిష్యత్తులో రైతన్న పచ్చగా ఉండాలంటే మనం
ఉడుతా భక్తి సాయం చేయాలి
సేద్యపు
భూములని కాంక్రీట్ అడవులుగా మార్చకుండా, సేద్యం చేసే వారికే ఇవ్వాలి.
*****
No comments:
Post a Comment