Thursday, May 25, 2017

బుద్ధుడి వెన్నెల


1.     వెన్నెల కాంతులలోమెరిసిపోతున్న
బుద్ధుణ్ణి చూస్తే ఏవో ఆలోచనలు

2.     యుద్ధాలతో కొట్టుమిట్టడుతున్నదేశాలకి
ఆయన ఇచ్చిన చల్లని శాంతి సందేశం
3.     జంతు హత్యకు పాల్పడే ప్రజలకు
ఆయన చెప్పిన అహింసా సూత్రం
4.     ‘అతి సర్వత్ర వర్జయేత్’ గనుక
మనవ మనుగడకు ఆయన సూచించిన అష్టాంగ మార్గం
5.     పుత్రవియోగంతోరోదించిన తల్లికి
ఆయన పంచిన ‘ఆవ గింజ’ జ్ఞానం
6.     ఆన్నీ తెలిసి ఈ రోజు మనం ఆయన మార్గాన్ని ఎందుకు విడనడుతున్నాం?
ఈ ప్రశ్నకి నా వద్ద జవాబు లేదు.
7.     చాలా సేపు ఆత్మావలోకనం చేసుకున్నా
అప్పుడు తెలిసింది ఇదంతా నేనెంచుకున్న భౌతిక మార్గమని.
8.     ఓ తథాగతా! నువ్వు చెప్పిన నాలుగు ఉన్నత సత్యాలని నేను మరచాను
ధనార్జనలో పడి ఆనందాన్ని పోగొట్టుకున్నాను
9.     ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను
నీ మార్గాన్ని అనుసరిస్తాను
నువ్వు పంచిన జ్ఞానవెన్నెలకి సదా కృతజ్ఞురాలను.
*****

No comments: