అన్నదాత
ఆత్మఘోష
1. ఫ్యాక్టరీలొచ్చాయి
మా నదులని కలుషితం చేశాయి
ఫ్యాక్టరీలొచ్చాయి
మా భూగర్భజలాలను దోచాయి
2. ఫ్యాక్టరీలొచ్చాయి
మా ఊరి పచ్చదనాన్ని తగ్గించాయి
ఫ్యాక్టరీలొచ్చాయి
మా ఊళ్ళో సాగు పొలాల విస్తీర్ణాన్ని తగ్గించాయి
3. ఫ్యాక్టరీలొచ్చాయి
మా వాతావరణాన్ని కలుషితం చేశాయి
ఫ్యాక్టరీలొచ్చాయి
మాకు జబ్బులని ప్రసాదించాయి
4. ఫ్యాక్టరీలొచ్చాయి
సాటి రైతన్నల పొట్టలు కొట్టాయి
ఫ్యాక్టరీలొచ్చాయి
ఉన్న- లేని వారి మధ్య అంతరాన్ని పెంచాయి
5. ఫ్యాక్టరీలొచ్చాయి
మమ్మల్ని మా భూములనుండి వేరు చేశాయి
ఫ్యాక్టరీలొచ్చాయి
మా ఆత్మవిశ్వాసానికి గండి కొట్టాయి
6. వినబడలేదా
మా ఆత్మఘోష
కనబడలేదా
మా బీడు భూమి
ఓ
భారతపౌరుల్లారా! ఇదేనా మీరన్నదాతకిచ్చే గౌరవం?
****
No comments:
Post a Comment