Wednesday, May 24, 2017

మాతృప్రేమ

1.     చిన్న పిట్టను కదా అని నాకు పిల్లలపై ప్రేమలేదని అనుకోవద్దు
చెట్టుకోమ్మపై చిన్న గూటిలో ఉంటాంగనుక గాలివానకి కొట్టుకుపోతామనుకోకండి.


2.     పిల్లల్ని కని చెత్తకుండీలో పారేసే రకం కాదు మాది
మా పిల్లలని రకరకాల ఉపద్రవాలనుండి కాపాడతాం.
3.     మా పసివాళ్ళు గుడ్లుగా ఉన్నప్పుడు పాముల బారి పడకుండా చూసుకుంటాం
మా పిల్లలకి ఎగురడం రానప్పుడు కూడు పెడతాం.
4.     వానలో నేను తడిసి, జ్వర పడినా నా పిల్లలని కాపాడతాను
రెక్కలని గొడుగు చేసి వాన తడి అంటకుండా చూసుకుంటాను.
5.      పిల్లల్ని కాపాడుకోవడం మీకే కాదు, మాకూ తెలుసు
మాతృప్రేమ అందరికీ సమానమే.
6.     పిల్లలపై మక్కువ
అయితే గీతే మాకే ఎక్కువ.

****

No comments: