Tuesday, May 2, 2017

మా ఊరి చెరువంటే...



1.     మా ఊరి చెరువంటే...
ఈతలు కొట్టిన నా బాల్యం

2.     మా ఊరి చెరువంటే...
బిందెల మీద బిందెల నీళ్ళు అతి చతురతతో మోసుకెళ్ళే వనితలు
3.     మా ఊరి చెరువంటే...
హైలో హైలేసా నావ ప్రయాణం
4.     మా ఊరి చెరువంటే...
గట్టున ఉన్న మఱ్ఱిచెట్టు ఊడలతో ఊగిన ఊయలలు
5.     మా ఊరి చెరువంటే...
అస్తమించే సుర్యబింబాన్ని గీయ తలపెట్టిన చిత్రాలు
6.     మా ఊరి చెరువంటే...
ఎండాకాలపుసాయంత్రంలో వీచే చల్లగాలి
7.     మా ఊరి చెరువంటే...
జ్ఞానోదయమయినట్టుచెట్టు కింద కూర్చుని వ్రాయ తలపెట్టిన‘కపి’త్వాలు
8.     మా ఊరి చెరువంటే...
తాడి మట్టపై ఆవలి ఒడ్డు చేరబోతూ కాలు జారి నీళ్ళలో పడడం
9.     మా ఊరి చెరువంటే...
ఒడ్డుని‘(అ)పావనం’ చేసే అశుద్ధం
10.                        మా ఊరి చెరువంటే...
రోజంతా స్నానం చేసే ఆవులు, గేదెలు!
11.                         ............ఇవన్నీ గుర్తుకు వస్తాయి
కానీవిప్పుడు....ఏదా చెరువు?
వ్యవసాయం నచ్చక కొందరు, అచ్చిరాక మరి కొందరు వలసపోయారు
12.                        చెరువులో పూడిక తీసేవాళ్ళు కరువయ్యారు
చెరువులో కలుపు విస్తరించింది
చెరువుని కాస్తా మింగేసింది
13.                        మాయమైన చెరువు బదులు మానవ సృష్టి ఇంద్ర భవనం వెలిసింది
వరదలొస్తే గాని తెలియదు ఈ భవనమెంత దృఢమైనదో!

****

No comments: