Friday, December 15, 2017

చిట్టి కథకి ముగింపు- కుప్పతొట్టి తెచ్చిన పంట!

Given Story:
(ఉదయం) అర్థరాత్రి పన్నెండు గంటలు. పరిశుభ్ర కార్మికురాలు సూరమ్మ పై ఆగంతకుల దాడి.తీవ్ర గాయాలు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ సూరమ్మ. కారణం ఏమై ఉంటుంది? మహానగరంలో రాత్రి పన్నెండింటి నుండి ఉదయం ఆరు వరకూ నగర పరిశుభ్ర కార్యక్రమంలో నిమగ్నమయ్యే కాంట్రాక్టు ఉద్యోగినిపై కక్ష కట్టి అంతమొందించే ప్రయత్నం నగర ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది ....
My Conclusion: 
కుప్పతొట్టి తెచ్చిన పంట!
        రెండు రోజుల తరువాత.....

స్పృహ వచ్చిన సూరమ్మ విషయమడిగిన ఇన్స్పెక్టర్ తో ఇలా చెప్పింది:
“అప్పుడు పన్నెండు గంటలకి పావు గంట ఉండుంటుందండీ.... నేను పనికి కావలసిన వస్తువులు తీసుకుని నడుస్తుంటే, నన్ను దాటుకుని ఒక పెద్ద కారు ఒక కుప్ప తొట్టి దగ్గర ఆగింది. ఇద్దరు వ్యక్తులు చేతులకి గ్లవ్స్ తొడుక్కుని, కుప్పతోట్టిలోంచి ఏదో తీస్తున్నారు. నాకు అనుమానమొచ్చి, వాళ్ళ దగ్గరకెళ్ళాను. రెండు పెట్టెలు తీశారు బాబూ..... నేను కేకలేసేసరికి నన్ను గట్టిగా కొట్టి పారిపోయారు బాబూ ఆ మోటు సచ్చినోళ్ళు!”
ఇన్స్పెక్టర్ వెంటనే ఆ రోడ్డు నెంబర్ కనుక్కుని, అక్కడి సీసీటీవీలో కారును గుర్తించి దుండగులను పట్టుకున్నాడు. వారు అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా సభ్యులు. తరువాతి సంవత్సరం రాష్ట ప్రభుత్వం ఆమె ధైర్య సాహసాలను మెచ్చి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమెకు ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేసింది.
******************

No comments: