Wednesday, December 6, 2017

చిత్ర కవిత- కోటి దండాలు



కోటి దండాలు
1.     నువ్వు దూర కంత లేదు, నీ మెడకో అంగవైకల్యపు డోలా? అనడుగుతుంది సమాజం
కూటికి పేదను కానీ మనసున్న మారాజును, ఆమె దివ్యాంగురాలు, అంటావు నువ్వు
నీ స్వచ్ఛమైన ప్రేమకు కోటి దండాలు!_/\_


2.     సంసారాన్ని ఈదలేక కష్టాలు పడుతున్నామనుకుంటారు లోకులు
సంసారమంటే సంతోషాన్ని పంచేదని, ఆ సాగరాన్ని ఆనందంతో ఈదాలని భాష్యం చెప్పావు నువ్వు
నీ ధైర్యానికి కోటి దండాలు! _/\_

3.     పెళ్లైతే చేసుకున్నావు, పిల్లనెందుక్కన్నావని అడిగారు లోకులు
దివ్యాంగురాలి కడుపున సవ్యాంగుడు పుట్టగలడని నిరూపించడం కోసమన్నావు నువ్వు
నీ ప్రగతిశీల ఆలోచనకి కోటి దండాలు! _/\_

4.     పేదవాడివి, భార్యాబిడ్డలని షికారుకెలా తీసుకు వెళ్తావని అడిగారు కొందరు
నా భుజ స్కందాల మీద, అని జవబిచ్చావు నువ్వు
నీకు కుటుంబంపై ఉండే ప్రేమకి కోటి దండాలు! _/\_

5.     లేనివాడివి, కుటుంబాన్నెలా పోషిస్తావని ప్రశ్నించారు మరి కొందరు
కాయ కష్టం చేసి, అని వెంటనే చెప్పావు నువ్వు
నీ ఆత్మవిశ్వాసానికి కోటి దండాలు! _/\_

******

No comments: