Tuesday, December 19, 2017

చిత్ర కవిత-- వృద్ధాప్యమా- నీకు జోహారు



వృద్ధాప్యమా- నీకు జోహారు
వయసు పెరిగాక పొగరు తగ్గింది
హెచ్చు- తగ్గు భావనలు ఎగిరిపోయాయి

వేసుకునేవి మాసిన చెప్పులైనా, మెరిసే బూట్లైనా
పట్టుకునేది బొంగైనా, చేతి కర్రైనా
తొడిగింది తుండు గుడ్డైనా, నూలు లాల్చీ అయినా
కట్టుకున్న పంచె మోకాళ్ళ దాకానో, మడమ దాకానో ఉన్నా
చూడ్డానికి రెండు కళ్ళున్నా, నాలుగు కళ్ళున్నా
మనిషిని మనిషిగా చూస్తూ, మనిషి అవసరాలకి విలువనిస్తూ
సమానత్వాన్ని పెంపొందించింది వృద్ధాప్యం
అందుకే, ఓ వృద్ధాప్యమా, నీకు జోహారు!

******

No comments: