Given Story:
" బావా...డాక్టర్ గారి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది...రేపట్నుండి మూడు రోజులు
"మెగా నేత్ర శిబిరం"...ఆపరేషన్ కి సిద్ధం కమ్మన్నారు...నాకు చూపు
వస్తుందట "
" అలాగా "
" ఎప్పుడు వెళ్దామంటావ్
"
" నీ ఇష్టం..."
" అదేమిటి బావా...ఇంత
మంచి వార్త చెబితే ఆనందంతో నన్ను ముద్దులతో ముంచెత్తుతావనుకున్నాను... అంత పొడి
పొడి మాటలతో... నీకు ఇష్టం లేదా "
" అలా అని నేను అనలేదే
"
" మొన్న డాక్టర్ గారి
దగ్గరకు వెళ్దామంటే " నాకు పని ఉంది " అని ఆటో ఎక్కించావు...ఇప్పుడు ఏ
రోజు వెళ్దామంటే ' నీ ఇష్టం ' అంటున్నావు... నాకు ఇష్టమైనది నీకు కష్టంలా ఉంది
బావా "
" అంత మాటనకు..."
" నీ మాటల్లో నిస్తేజం
చూస్తుంటే నాకు జీవితాంతం ఇలానే ఉండిపోవడం మంచిదనిపిస్తోంది బావా..."
My Conclusion:
“నీకు కళ్ళు వస్తే, నా కన్నా సంతోషించేదెవరు?
నేను కానూ”, అన్నాడు మహర్షి నిర్లిప్తంగా. “నీ మాటలు బాగానే ఉన్నాయిగానీ, నీ
ధోరణిలోనే ఏదో తేడా ఉంది బావా. కొంపదీసి నన్నొదుల్చుకుని వేరే అమ్మాయినిగాని..”,
అనబోతుండగా అతడు తన చేత్తో ఆమె నోరు మూసి, “ఛ, ఛ, అవేం మాటలు లతికా! నా జీవితంలో
నీకు తప్ప వేరెవరికీ స్థానం లేదు. ఇప్పుడు నీకు ఏం తక్కువ జరిగిందని?” అన్నాడు
లతికపతి. “నీకేం తక్కువ జరిగిందని అడుగుతావుగాని, ఆక్సిడెంట్లో పోయిన నా కళ్ళు
చూపుకి మళ్ళీ నోచుకుంటున్నాయన్న సంతోషమే లేదు. అంధకారం అంటే నీకంత ఇష్టమా?” ఎదురు
ప్రశ్నవేసిందామె. “నన్ను ఏం చూసి చేసుకున్నావ్?” అడిగాడతను. “నువ్వు నాకు వరసైన
వాడివి కాబట్టి. నువ్వు మంచి వాడివి కాబట్టి. ఇప్పుడెందుకా అసందర్భ ప్రేలాపన?”
అంది లతిక. “సందర్భం ఉంది లతికా! నా అందం నీకేమీ కాదా!” అడిగాడు పతి. “ఓ అదా! నీ
అంత అందమైన భర్త ఈ జిల్లాలో ఎవరికీ దొరకరనేగా అనేదాన్ని? ఇప్పుడూ అంటా! అయితే ఏమిట్ట?”
అంది లతిక. “అదే నా భయం కూడా లతికా! మనకి జరిగిన ఆక్సిడెంట్లో నా మొహానికి గట్టి
దెబ్బ తగిలి, ముక్కు చితికిపోయింది. మూతి వంకర పోయింది. ఈ మొహంతో నన్ను చూసి ఇష్టపడతావా?”
బాధగా అసలు విషయం బయట పెట్టాడు భర్త. “అవేం మాటలు బావా? రెండేళ్ళ మన కాపురంలో
ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది? నాకు కావలసింది నువ్వు. పెళ్ళైన కొత్తలో నీ అందం
గురించి అలా చెప్పి ఉంటాను గాని, అందం కోల్పోతే నిన్ను వదిలేస్తానని కాదు. ఇప్పుడు
నేను గుడ్డి దాన్ని గనక నన్ను వదిలేశావా? లేదే! అదే బావా ప్రేమంటే! ఇందాక నన్ను అడిగినప్పుడు
నీ అందం నాకసలు గుర్తొచ్చిందా? నువ్వు ఎలా ఉన్నా నువ్వు, నీ మనసు నాక్కావాలి.
అక్కడెప్పుడూ నాకే చోటుంటుందని తెలుసు”, అని లతిక అనేసరికి ఆనందబాష్పాలు కారాయి ఆమె భర్త కళ్ళలో.
****************
No comments:
Post a Comment