Tuesday, November 28, 2017

చిత్ర కవిత- అద్భుతమైన బాల్యం



అద్భుతమైన బాల్యం
పెద్దా-చిన్నా తేడా లేదు
మంచీ- చెడు ధ్యాసే లేదు
వెలుగూ- చీకటి భయమే లేదు
వాళ్ళూ- వీళ్ళూ ఉన్నారన్న తటపటాయింపు లేదు
పిల్లలందరూ స్నేహితులే
అందరూ మంచి వారే!
అన్నీ అందమైనవే!
పాడాలనిపిస్తే పాడెయ్యడమే!

ఉదయ కిరణ రేఖ ఒక అద్భుతమైతే,
ఎగిరే పావురం మరో అద్భుతం!
ఆకుల పచ్చదనమొక అద్భుతమైతే
రాలే నీటి చుక్క ఒక అద్భుతం!
ప్రకృతిని చూసి ఒళ్ళు పులకరిస్తే ఒక అద్భుతం
ప్రకృతితో మమైకమనుకోవడం మరో అద్భుతం
చిన్న చీమే ఒక ఒక అద్భుతం
క్రిమికీటకాల మన్నే ఒక అద్భుతం
బ్రతుకే ఒక అద్భుతం
బాల్యమే ఒక అద్భుతం
ఆనందోత్సాహాలకి అక్కరలేదు కారణం
అటువంటి అద్భుతమైన బాల్యాన్ని
తీరని ఆకలి సృష్టించి, పిల్లలకి కాకుండా చేస్తున్నాం
గాడ్జెట్లు కొనిచ్చి, పిల్లలకి కాకుండా చేస్తున్నాం
రియాలిటీ షో పేరిట పిల్లలకి కాకుండా చేస్తున్నాం
మన బాల్యం అద్భుతంగానే జరిగింది కదా!
ఆపాటయినా మన  తరువాతి తరం అనుభవించద్దూ!

******************

No comments: