Wednesday, November 8, 2017

చిత్ర కవిత- తేడా

తేడా
1.     మనదేశంలో ఇంత మంది సంపన్నులున్నారని లెక్క చెబితే ఏం గొప్ప?
మన దేశం సమ సమాజాన్ని స్థాపించిందంటే చెప్పుకోవచ్చు గొప్ప.


2.     వాళ్ళకి ఒళ్ళంతా కప్పుకోవడానికి లేవు బట్టలు
బీరువా ఒలికిపోయేలా కావాలా మనకి బట్టలు?

3.     వార్తాపత్రికే వాళ్ళకి పళ్ళెం
మనకి తనివి తీరదు, కావాలి మరో వెండి పళ్ళెం.

4.     ఉన్నది కొంచెమే కానీ ఉంది వాళ్ళలో పంచుకునే సుగుణం

ఆస్తిపాస్తులు ఎక్కువైనప్పుడు ఎందుకొస్తుంది మనలో లాక్కునే కాపీనం?


5.     వాళ్ళు తిండికీ, గుడ్డకీ లేనివారు కావచ్చు గానీ మొహం నిండా హ్యాపీ హ్యాపీ

అన్నీ ఉన్న వాళ్ళకి ఎందుకో అత్యాశ వల్ల బీపీ?


*****

No comments: