కూకటి వేళ్ళతో పెకలిద్దాం
1.
అవినీతి, లంచగొండితనం పెరిగిపోతున్నాయని తల బాదుకునే
భారతీయులారా!
మనం కోరుకునే మంచికి మనమే ప్రారంభోత్సవం చేద్దాం.
2.
మొక్కై వంగనిది మానై వంగదని మనకు తెలుసు
మన పిల్లలని అతి గారాబం చేసి, అచ్చోసిన
ఆంబోతులవకుండా కాపాడుదాం
వారిని క్రమశిక్షణతో
పెంచుదాం
బడిలో గురువుని గౌరవిద్దాం,
గురువు నిర్దేశంలో నడత సాగేట్టు చూసుకుందాం.
3.
యుక్త వయసు మొదలుకొని చెడు అలవాట్లకు, చెడు సావసాలకు దూరంగా
ఉందాం
మనకు తెలిసిన మేరకి
మరెవరినీ వాటి జోలికి పోకుండా కాపాడుదాం
మనకున్న హోదాని అహంకారంగా
మారకుండా చూద్దాం
డబ్బులకి, ఇతర ప్రలోభాలకి
లోను కాకుండా మనలని, మన దేశాన్ని రక్షిద్దాం.
4.
మన పరిధిలో నిజాయితీగా ఉందాం, నిజాయితీపై అవగాహన పెంచుదాం
అవినీతిని ఎదిరించుదాం, అవినీతిపరులను
పట్టిద్దాం
చరవాణిని మంచి పనులకు
ఉపయోగిద్దాం
అవినీతిని రికార్డు చేసి
గుట్టు రట్టు చేద్దాం.
5.
అవినీతిపరులు అల్పసంఖ్యాకులు
కాని వారి చేసేది తప్పని
చెప్పేవారు లేరు
చూసీ చూడనట్టుంటే అవినీతి తన
విషప్రయోగం కొనసాగిస్తుంది
కొంతకాలానికి మనల్ని
కబళిస్తుంది.
6.
పదండి అందరం కలసి నడుం బిగిద్దాం
నీతికి పెద్ద పీట వేద్దాం
అవినీతిని పరద్రోలడమే కాదు
కూకటి వేళ్ళతో పెకలిద్దాం!
7.
మనం కోరుకున్న మంచిని మనమే సాధిద్దాం
అవినీతి నిర్మూలనలో మేటి
భారత దేశానికి వేరెవరూ లేరు సాటి అనిపిద్దాం!
******
(This verse won a special prize in the poetry competition conducted by the New India Assurance Company, Visakhapatnam, as part of their Vigilance Awareness Week.I have since translated it into English at the request of a few well-wishers & friends, but it comes with a disclaimer that the Telugu version is better than the English one).
Let’s
Uproot It from the Deep
1.
O dear Indians! Are you saddened by the
rampant increase in bribery and lack of integrity?
Let’s
inaugurate the good we want to see in the society.
2.
That the younger is malleable is known to us,
so-
Let’s
not pamper our children so much that
They
turn out to be parasites on the society.
Let’s
bring them up with discipline
Let’s
respect the teachers in school and
Be
guided by the Guru in our path.
3.
Let’s keep away from the bad, company and
habits starting from youth,
And
prevent others from treading this suicidal path
To
the best of our ability.
Let’s
not let our status be the source of our arrogance
Let’s
protect ourselves and our country from falling a prey
To
the temptations of money or anything else.
4.
Let’s be honest in our life and
Let’s
spread awareness about this great virtue
Let’s
oppose corruption and get the corrupt caught by law
Let’s
use the mobile for productive purposes
Let’s
record corrupt practices and expose the corrupt.
5.
Let’s remember that the corrupt are a
minority
But
we the people look the other way
When
they indulge in their nefarious activities
Let’s
stop this indirect encouragement
Which
helps it to spread its tentacles far and wide.
In
due course, it will gobble us, too!
6.
Let’s all pull up our socks
Let’s
all put honesty and integrity on a high pedestal
It
is not enough if we drive out corruption
For
it may come back
Let’s
uproot it from deep within!
7.
Let’s ourselves achieve the good we want in
the society AND
Let’s
make India the best country in corruption eradication.
*****
4 comments:
చాలా బాగుందండి సూర్యలక్ష్మి గారు!! తెలుగులో చెబితే హృదయానికి హత్తుకుంటుంది, మస్తిష్కానికి సులువుగా ఎక్కుతుంది. సరళమైన భాష చాలా చక్కగా చెప్పారండి.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు విశాలి గారూ!
Beautiful and very relevant poem. Thanks for translated version.
thank you bedge!
Post a Comment