Wednesday, May 16, 2018

చిత్రకవిత- ఆ కళ్ళు చాలు




ఆ కళ్ళు చాలు
‘అందమే ఆనందం’ అని పాడిన ఈమె అందానికి అందం
ఏమిటో ఆ మాయ! నటనలో చాకచక్యం ఆమె సొంతం


ఆ కళ్ళు చాలు
నవరసాలు పండించడానికి
ఆ కన్నీళ్లు వాన తుంపర్లు,
పొంగే నదులు
ఆ రసాన్ని పండించడానికి.
ఆమె కన్నుల అభినయం
కడు అభినందనీయం.

అలంకారాలున్నా లేకపోయినా
ఆమె చిరునవ్వే ఆమెకు అలంకారం.

బ్రతుకు అందలమెక్కించినా
అగాధంలోకి నెట్టినా
చెదిరిపోనిది ఆమె దయాగుణం.

బాధను అభినయించడంలో
అమెది అందె వేసిన చెయ్యి
అందుకేనా జీవితం ఆమెను  
తోసింది బాధల సముద్రం లోకి?

సాటిలేని మేటి ఆమె అన్నింట
ఆమె నివసిస్తుంది మనస్సులలోనంట!
*******

No comments: