Wednesday, May 2, 2018

చిత్రకవిత- ఆధునిక అన్నపూర్ణ


ఆధునిక అన్నపూర్ణ
పేదరికం పాత విషయమే
ఆకలి కూడా అంతే
ఆకలి గొన్నవారికి కూసింత
బువ్వ పెడితే అన్నపూర్ణ అనేవారు.



రోజులు మారాయి
కాలం మారింది
మనుషుల్లో స్వార్థం పెరిగింది
దానగుణం తరిగింది.
ఇవి గాక, ఇంటి వంట సంత,
కాదు కాదు, కర్రీ పాయింటుకెళ్ళింది
మనమే తిండి కొనుక్కుంటే
మిలిగిన వాళ్ళకింత డబ్బు పోసి
కొని పెడతామా?
అందులోనూ మనం తినేవి పిజ్జా బర్గర్లాయె!


కొందరు మాత్రం మంచిగా ఉండడానికి,
మంచి చెయ్యడానికి పుడతారు
ఆధునిక వస్త్రధారణ చేసినా
పరుల మేలు కోరే మనిషి కనుక
ఆరోగ్యం పాడుచేసే పిజ్జా, బర్గర్లు కొనక
ఆకలి తీర్చి బలం చేకూర్చే మినీ మీల్స్ తో
కడుపు నింపుతోందీ ఆధునిక అన్నపూర్ణ!
*********


No comments: