Wednesday, May 30, 2018

చిత్రకవిత-ప్రేమ లాల



ప్రేమ లాల

మబ్బుల మెత్తటి పరుపు లేదు
కాయకష్టం చేసిన నా కాళ్ళే పరుపు.


అష్టైశ్వర్యాల బాత్ టబ్బు లేదు
అమ్మ అడ్డాల కన్నా సౌకర్యమైన బాత్ టబ్బు ఉండదుగా!

లాల పోసేందుకు గీజర్ లేదు
అయినా వేన్నీళ్ళకి గీజర్ అవసరం లేదు.

రుద్దేందుకు బేబీ సోపు లేదు
చర్మాన్ని మృదువు చేసే సున్నిపిండి ఉంది.

ఉన్నవారింట పనివారు పనిలా చేయించే స్నానం కాదిది
ప్రేమతో, అమ్మ పోసే ప్రేమ లాల!
***




No comments: