Wednesday, December 13, 2017

చిత్ర కవిత- ఉత్తర పురుషుడు

ఉత్తర పురుషుడు
పుట్టిన రోజు గ్రీటింగ్ అందుకుని స్వీట్ ఇచ్చిన రోజులు.....
న్యూ ఇయర్ గ్రీటింగ్ అందుకుని  శుభాకాంక్షలు చెప్పిన రోజులు....
పోటీ పరీక్ష హాల్ టికెట్ ఆదుర్దాగా అందుకున్న రోజులు......
నాకు ఉద్యోగం వచ్చిందన్న ఉత్తరం ఇచ్చిన అతనికి ఆనందం వచ్చిన రోజు.....

ఎండాకాలంలో టోపీతో.....
వానాకాలంలో రెయిన్ కోటుతో...
చలి కాలంలో స్వెటర్, ముఫ్లర్ తో.........
ఏ ఋతువైనా మనకు సైకిల్ తో ప్రత్యక్షమయ్యే నేస్తం....

ఒకప్పుడు రోజుకి రెండు సార్లు,
ఈ మధ్య రోజుకొకసారి
సోమవారం కాస్త ఆలస్యంగా...
కార్డు, ఇన్లాండు, కవరు...
మనీ ఆర్డరు, రిజిస్టర్డ్ పోస్టు, పార్సెల్...
ఏరోగ్రామ్, పిక్చర్ పోస్ట్ కార్డు .... ఒకటేమిటి, రకరకాల రూపాలలో
మా స్నేహితులని, చుట్టాలని దగ్గరకు తెచ్చిన వంతెన
మనుషుల్ని కలిపే మనిషి,
మేం పెద్దౌతుంటే తను రిటైర్ అయిన మనిషి...
ఇప్పుడు ఫోటో చూడగనే మధుర స్మృతులు కలిగించిన ఆ మనిషి....
వేరెవరో కాదు మా వీధి ఉత్తర పురుషుడు!

*******************

No comments: