Wednesday, May 23, 2018

చిత్రకవిత- మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు




మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు

మొక్కలు నాటామని లెక్కలు చెప్తే చాలదు
వాటిని సరిగ్గా సాకామా లేదా చూసుకోవాలి
నీళ్ళు మాత్రమే పోస్తే సరిపోదు
కాలుష్యపు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.


ఓ భారతీయుడా!
నాకిన్ని హక్కులున్నాయని విర్రవీగితే సరిపోదు
నీ భవిష్యత్తు కోసం చెడ్డ పనులు చేయకూడని బాధ్యత నీపై వుంది
నాకు డబ్బుంది, కావలసినది తింటానంటావా?
తిను, కానీ ప్లాస్టిక్ సంచీ మొక్కలలో వేయకు.

నేను పారెయ్యని చెత్త నేనెందుకు ఎత్తాలంటావా?
నువ్వెప్పుడూ చెత్తని నీ ఇంటిలో జాగ్రత్త చేసేవాడివా?
లేక పక్కింట్లోనో, రోడ్లోనో వేసేవాడివా? గుర్తు తెచ్చుకో
నువ్వూ నలుగురిలో నారాయణవైతే మరొకర్ని వేలెత్తి చూపకు.

చెట్లని నాటడం పర్యావరణానికి ఎంత ముఖ్యమో
ప్లాస్టిక్ వాడకపోవడం కూడా అంతే ముఖ్యం
మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చెయ్యకు
ఇతరులు మెచ్చుకునేలా జీవనం సాగించు!
****

No comments: