Wednesday, May 2, 2018

చిత్రకవిత- చిట్టితండ్రి



చిట్టితండ్రి
పుట్టింది రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబంలో
ఆకలి అలవాటైన అతనికి, కట్టేందుకు బట్టలు కూడా కరువే!
ఆడిపాడాల్సిన పసితనంలో వయసుకి మించిన భారం మోస్తున్నాడు-
చంకలో ఉన్న తమ్ముడు కాదు, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత
ఆ పసితతనపు అమాయకత్వం మిగిలిన పిల్లలు వెకిలిగా నవ్వినా పట్టించుకోదు
వాళ్ళకేం తెలుసు, ఆ మనసులో ఏముందో?


అందరిలాగా, అందరితో కలిసి చదువుకోవాలని,
చదువు తప్ప మరేం బాధ్యతలూ లేకుండా బతకాలని!
కన్న కలలు కలలుగా మిగిలిపోతే, కనీసం చూస్తే కూడా తప్పా?
వాళ్ళు తన పేదరికాన్ని అవహేళన చేసినా,
కనీసం కళ్ళకి బడి వేడుక చూపించాలనుకున్నాడు,
ఆ పనే చేస్తున్నాడు, పాపం ఆ చిట్టితండ్రి!
***************

No comments: