Showing posts with label difficulty in writing English. Show all posts
Showing posts with label difficulty in writing English. Show all posts

Tuesday, May 27, 2014

నేను తెలుగులో వ్రాయగలనా? ఐతే ఎందుకు వ్రాయాలి?

నా మాతృభాషైన తెలుగులో ఒకప్పుడు బాగానే వ్రాసేదాన్ని. అంటే రెండవ భాషలో మంచి మార్కులు వచ్చేంత. ఎటొచ్చీ నవలలూ గట్రా చదివేదాన్ని కాదు. నవలలో అశ్లీలత వుందో, నవలలో హింసకి పెద్దపీట వేశారో, దేనిలో స్త్రీలను చిన్నచూపు చూశారో ముందుగానే తెలుసుకోడానికి రోజుల్లో గూగుళ్ళు వుండేవి కావు కదా! అలా అని ఆకాలపు సాహిత్యాన్ని తప్పుబట్టడంలేదు సుమండీ! నేను ఎందుకు అజ్ఞానిగా మిగిలిపోయనో మీకు చెపుతున్నాను, అంతే! అలా చందమామలో కథలు చదివి, పెరిగి, పెద్దైన నేను తెలుగులో వ్రాయడానికి భయపడడంలో ఆశ్చర్యం లేదు కదా!