పెద్ద ఉద్యోగం
అపర భద్రకాళిలాగ మీనాక్షి
భీకర రూపం దాల్చింది. కనపడ్డ వస్తువే ఆయుధంగా మలచుకొని భర్త నిరూప్ ని చితకబాదింది.
“మీనా, మీనా”, అని ఆమెను అనునయించబోయినా పనిచేయలేదు. “భార్యకు తెలియకుండా
వెధవ్వేషాలేస్తావుట్రా!” అని హుంకరించింది. “లేదు అమ్మతల్లే, ఈ మాటు మా ఆవిడకి
చెప్పి మరీ చేస్తాను”, అన్నాడు అతి తెలివిగా. అంతే, మరో రౌండ్ కోటింగ్ ఇచ్చింది
మీనాక్షి. “భార్యని గౌరవించడం చేతకాని నీకు భార్య కావలసి వచ్చిందా? మీ
అమ్మానాన్నలని అనాలి, నీ లాంటి అచ్చోసిన ఆంబోతులని అపర శ్రీరామచంద్రులని చెప్పి, పెళ్ళికూతుళ్ళ
ముందుకి వదిలినందుకు”, అని తిడుతూనే ఉంది. “శాంతించు తల్లే....”, అని కాళ్ళ మీద
పడ్డాడు. “మరెప్పుడైనా అబద్ధాలు చెప్తావా?” అని భీకర స్వరంతో అడిగింది మీనాక్షి. “ఆపద్ధర్మాలో?”
అని సందేహం వెలిబుచ్చాడు. మరో రౌండ్ తగిలిస్తూ, “ఊహూఁ”, అని గద్దించింది. “సర్లే
తల్లే, ఇంకెప్పుడూ ఎవరితోనూ అబద్ధాలు చెప్పాను. మా ఆవిణ్ణి వదిలిపెట్టు తల్లే..”
అని బతిమాలాడు.