Showing posts with label value of poverty. Show all posts
Showing posts with label value of poverty. Show all posts

Wednesday, April 5, 2017

పేదరికం విలువ


1.     పేదరికం ఎరుగని ఓ తల్లిదండ్రులారా!
పేదరికం ఎంత నికృష్టమైనదో తెలుసా?
తిండికి మొహం వాచిన వారిని చూసి మొహం తిప్పుకుంటే చాలదు
లాప్టాప్ తో ఆడుకునే మీ చంటాడికి కొన్ని చూపండి
ఆడుకోవలసిన వయసులో వయసుకి మించిన భారాలు మోసే పిల్లలను,
ఎడ్లని మేపే చంటాళ్ళను, బాల కార్మికులై పొట్ట పోసుకునే వారిని-
వీరందరినీ లాప్టాప్ లో చూపి పేదరికం విలువ నేర్పండి,
మీరు పేదలు కానందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పండి.