Tuesday, August 22, 2017

నువ్వే


1.   నువ్వే
1.     నా ప్రశాంత నిద్రకు కారణం నువ్వే
నా దేశాన్ని రక్షించే త్యాగ మూర్తివి నువ్వే.

Thursday, August 17, 2017

చిట్టి కథ- keywords- “వీడ్కోలు...ఏదైనా ఎప్పుడైనా వేదనాభరితమే"- ఎంత ఎదిగిపోయిందో!



నా కడుపున కాసిన ఒక్కగానొక్క కాయంటే నాకు వల్లమాలిన అభిమానం సుమీ! నా చిట్టి తల్లి అలిసిపోతుందని ఇంటికి దగ్గరలో ఉండే స్కూల్లో చేర్పించాను, మా వారెంత వారించినా! నేను ఎమ్మెస్సీ పాస్ అయ్యాను కాబట్టి ఆ రెసిడెన్షియల్ కాలేజీలలో పెట్టకుండా, ట్యూషన్లకి పంపకుండా చదివించాను. పెళ్లి చేస్తే, ఇల్లరికపుటల్లుడికి ఇచ్చి చేద్దామనే ఆలోచన కూడా వచ్చింది నాకు. ఇల్లరికం అనేది తిరోగమనపు ఆలోచన అనే విషయం కూడా తట్టలేదప్పుడు. 

Tuesday, August 15, 2017

అన్నదాతకు జేజేలు

అన్నదాతకు జేజేలు
1.     అతను కష్టాన్ని నమ్ముకుంటాడు
పైరవీలను కాదు.

Sunday, August 13, 2017

చిట్టి కథ- keywords- {"సర్లెండి...శుభాకాంక్షలు " అంది ఆమె దు:ఖాన్ని దిగమింగుకుంటూ}- తప్పిదం

తప్పిదం
భామ, గోపి ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎంసెట్ లోనూ, ప్రతీ సెమ్ లోనూ కూడా భామకే మొదటి స్థానం లభించేది. వాళ్ళు పెద్ద స్నేహితులు కారు గానీ ఒకరికొకరు ఆరోగ్యకరమైన పోటీనిచ్చుకునేవారు. అలాంటిది, నాలుగో యేడు పూర్తయ్యాక మొత్తానికి అతనికి మొదటి స్థానం వచ్చిందట! ఆ విషయం అతనే స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. సెక్షన్ లో కనుక్కుంటే చెప్పారట అనధికారికంగా.

చిట్టి కథ – key word- ఛెళ్ళు- ఎందుకు మానేసిందంటే...


ఎందుకు మానేసిందంటే...
        కరెంటు పోయింది. అనుపల్లవికి చాలా ఇష్టమైన చిరు మెగా హిట్, ‘గ్యాంగ్ లీడర్’, జెమినీ మూవీస్ లో మొదలవబోతోంది. ఛీ.. ఈ పాడు కరెంటు ఇప్పుడే పోవాలా! జస్ట్ అరగంట పోయినా టైటిల్ సాంగ్ మిస్ అవుతాం. అయినా, నువ్వెంటే పల్లవీ, ఇంత మంచి సినిమా టీవీలో వస్తూంటే, కరెంటు పొతే, నిమ్మకు నీరెత్తినట్టున్నావు?” అంది. “ఇప్పటికి ఎన్ని సార్లు చూశావే అనూ?” అడిగింది పల్లవి. “నచ్చిన సినిమాని ఎన్ని సార్లయినా చూస్తాం. ఏం, నీకు నచ్చిన సినిమాలు నువ్వు చూడవేమిటి?” అని పెడసరంగా జవాబిచ్చింది అనుపల్లవి. “ఒకప్పుడు నీలాగే ఉండేదాన్ని.  అది నా చిన్నప్పటి మాట. ఆ కాలంలో నాకు సినిమా పిచ్చి చాలా ఉండేది. నాకు గనుక సినిమా నచ్చిందంటే ఎన్ని సార్లు చూడడానికైనా వెనుకాడేదాన్ని కాదు”, అంది పల్లవి. “మరైతే ఇప్పుడెందుకు మానేసావ్?”

Thursday, August 10, 2017

చిట్టి కథ -keywords"ఛీ పొండి...మీరు మరీనూ ".. హాస్య సరస మేళవింపుతో -- పెద్ద ఉద్యోగం

పెద్ద ఉద్యోగం

అపర భద్రకాళిలాగ మీనాక్షి భీకర రూపం దాల్చింది. కనపడ్డ వస్తువే ఆయుధంగా మలచుకొని భర్త నిరూప్ ని చితకబాదింది. “మీనా, మీనా”, అని ఆమెను అనునయించబోయినా పనిచేయలేదు. “భార్యకు తెలియకుండా వెధవ్వేషాలేస్తావుట్రా!” అని హుంకరించింది. “లేదు అమ్మతల్లే, ఈ మాటు మా ఆవిడకి చెప్పి మరీ చేస్తాను”, అన్నాడు అతి తెలివిగా. అంతే, మరో రౌండ్ కోటింగ్ ఇచ్చింది మీనాక్షి. “భార్యని గౌరవించడం చేతకాని నీకు భార్య కావలసి వచ్చిందా? మీ అమ్మానాన్నలని అనాలి, నీ లాంటి అచ్చోసిన ఆంబోతులని అపర శ్రీరామచంద్రులని చెప్పి, పెళ్ళికూతుళ్ళ ముందుకి వదిలినందుకు”, అని తిడుతూనే ఉంది. “శాంతించు తల్లే....”, అని కాళ్ళ మీద పడ్డాడు. “మరెప్పుడైనా అబద్ధాలు చెప్తావా?” అని భీకర స్వరంతో అడిగింది మీనాక్షి. “ఆపద్ధర్మాలో?” అని సందేహం వెలిబుచ్చాడు. మరో రౌండ్ తగిలిస్తూ, “ఊహూఁ”, అని గద్దించింది. “సర్లే తల్లే, ఇంకెప్పుడూ ఎవరితోనూ అబద్ధాలు చెప్పాను. మా ఆవిణ్ణి వదిలిపెట్టు తల్లే..” అని బతిమాలాడు.

Wednesday, August 9, 2017

ఆనందపుటలలు

1.     అలలు-తీరం ఒకే కుటుంబానికి చెందినవి
అలలది పిల్లల మనస్తత్వం- విసురుగా ఉంటాయి
తీరానిది కన్న ప్రేమ- ఆ ఆకతయితనాన్ని భరిస్తుంది.

ఇంకెక్కడి రిక్షా?


1.     చిన్నప్పుడు ఆటోలు దొరికేవి కావు
పైగా దొరికితేనేమో ఖర్చెక్కువ