Wednesday, August 9, 2017

ఇంకెక్కడి రిక్షా?


1.     చిన్నప్పుడు ఆటోలు దొరికేవి కావు
పైగా దొరికితేనేమో ఖర్చెక్కువ

2.     రిక్షాలో అయితే ఎక్కువ సమయం
అయితేనేం? పని జరిగేది, కంతకు తగ్గ బొంతలాగా!
3.     ఎండనుండీ, వాన నుండీ  కాపాడే ఆ టాపు
తీసేస్తే ఇంచుమించు ఊరేగింపు!
4.     పిల్లలని బడికి తీసుకెళ్ళే ఆ రిక్షా
పెళ్ళి మంటపాలకి అతిథులను చేర్చేది.
5.     బొంతలు మాయమయ్యి మాట్రెస్లు వచ్చాయి
రిక్షాల బదులు స్వంత వాహనాలు రోడ్లని నింపాయి.
6.     ఎవరికి వారు రిక్షావాళ్ళయ్యారు
రిక్షావాళ్ళు మాయమయ్యారు.
7.     రిక్షా అంటే మ్యూజియంలో చూపించే స్థితి వచ్చింది నేడు
వాషింగ్ టన్ లో లాగ మ్యూజియం దగ్గర రిక్షాలు మాత్రం లేవు
8.     ఇదంతా ఆధునిక సమాజం తీసుకొచ్చే మార్పు అనుకుందాం
శ్రమని మరబొమ్మ ఓడించినా, శ్రమని గౌరవిద్దాం!



*****

No comments: