నా కడుపున కాసిన
ఒక్కగానొక్క కాయంటే నాకు వల్లమాలిన అభిమానం సుమీ! నా చిట్టి తల్లి అలిసిపోతుందని
ఇంటికి దగ్గరలో ఉండే స్కూల్లో చేర్పించాను, మా వారెంత వారించినా! నేను ఎమ్మెస్సీ పాస్
అయ్యాను కాబట్టి ఆ రెసిడెన్షియల్ కాలేజీలలో పెట్టకుండా, ట్యూషన్లకి పంపకుండా
చదివించాను. పెళ్లి చేస్తే, ఇల్లరికపుటల్లుడికి ఇచ్చి చేద్దామనే ఆలోచన కూడా
వచ్చింది నాకు. ఇల్లరికం అనేది తిరోగమనపు ఆలోచన అనే విషయం కూడా తట్టలేదప్పుడు.
మా
సాధన ఎంచక్కా మా ఊళ్ళోని ఐఐటీలోనే చదువుకుంది. కాంపస్ ఇంటర్వ్యూలో మా ఊళ్లోనే ఉద్యోగం
తెచ్చుకుంది కూడా! నల్లేరుపై బండి నడకలా సాగుతున్న మా జీవితాలకి పెనుతుఫానులా
వచ్చిపడిందా ట్రైనింగ్. అది కూడా మా ఊళ్ళో చేయిస్తే పోలే! ఊహూఁ, వాళ్ళు చెప్పిన
ఊళ్ళోనే వెలగబెట్టాలట! నేను మా ముద్దుల బిడ్డకి తోడుగా వెళ్ళి తన గదిలో అన్నీ
సర్దిపెట్టాను. రాత్రి నా హోటల్ గదికి తిరిగి వచ్చేటప్పుడు నేను ఏడ్చాను, కన్నీరు
మున్నీరుగా. నా చిట్టితల్లి, తన దుఃఖాన్ని ఆపుకుంటూ, “ఊరుకో అమ్మా.... వీడ్కోలు...ఏదైనా
ఎప్పుడైనా వేదనాభరితమే...", అని, నన్ను ఓదార్చింది.
ఎంత ఎదిగిపోయిందో!
No comments:
Post a Comment