1. నువ్వే
1. నా
ప్రశాంత నిద్రకు కారణం నువ్వే
నా
దేశాన్ని రక్షించే త్యాగ మూర్తివి నువ్వే.
2.
దేశానికి బాహ్యశత్రు భయం పోగొట్టేది
నువ్వే
నీ
కుటుంబానికి దూరమైన వాడివి నువ్వే.
3.
దేశపు పిల్లల భవిష్యత్తుని భద్ర పరిచేది
నువ్వే
నీ
పిల్లలకు దూరమైనదీ నువ్వే.
4.
సెలవులయ్యాక ఇంటిని వదలడానికి వెనుకాడని
వాడివి నువ్వే
యుద్ధంలో ప్రాణానాలర్పించేందుకు
వెనుకాడని వాడివి కూడా నువ్వే.
5.
భారత దేశపు జవానువి నువ్వే
భారతమాత
ముద్దుబిడ్డవి నువ్వే.
*****
No comments:
Post a Comment