Wednesday, August 9, 2017

ఆనందపుటలలు

1.     అలలు-తీరం ఒకే కుటుంబానికి చెందినవి
అలలది పిల్లల మనస్తత్వం- విసురుగా ఉంటాయి
తీరానిది కన్న ప్రేమ- ఆ ఆకతయితనాన్ని భరిస్తుంది.


2.     కొన్ని అలలకి జోరేక్కువ
కొన్నిటికి బద్ధకం ఎక్కువ
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీరాన్ని తాకుతాయి.

3.     కొన్ని అలలు తీరానికి గవ్వల హారాలనిస్తాయి
మరి కొన్ని తీరపు మట్టిని తన్నుకు పోతాయి
ఏది ఏమైనా రెండూ కలిసే ఉంటాయి.

4.     ఎప్పుడూ కలిసుండేటప్పుడు ఈ విసురెందుకు?
మరి మానవులు నేలనీ, నీటినీ కలుషితం చేస్తున్నారుగా!
అయితే, ఇప్పుడేంచెయ్యాలి?

5.     మానవులు నేలనీ, నీటినీ గౌరవించాలి
తద్వారా అలల కోపం తగ్గించాలి
అలలన్నీ  ఆనందపుటలలై సంతోష తీరాన్ని తాకాలి.
*****
(ఆనందపుటలలు అనే మాటకు స్ఫూర్తి సద్గురు గారి ‘అలై అలై’ అనే తమిళ పాట)



No comments: