Friday, February 16, 2018

చిత్రకవిత- ఉన్మాదాన్ని ఆపండి




ఉన్మాదాన్ని ఆపండి
జంతువులేవీ తమ జాతిని చంపజూడవు
మానవుడు వాటికన్నా తెలివైన వాడు కదా!
అందుకే తోటి మానవులని చంపబూనుతాడు.
ఇలాంటి మనవ మృగం ఒక అపాయపుపాయం ఆలోచించాడు
మందుపాతరతో ఎక్కువమందిని పైకి పంపే పన్నాగం పన్నాడు
అది పేలినందుకు పకపకా వికటాట్టహాసం చేశాడు.
అతను ఎవరిని చంపజూశాడో తెలియదు
నేనతనీకేం ద్రోహం చేశానో తెలియదు
నేను అటుగా వెళ్ళినప్పుడే  ఆదెందుకు పేలిందో తెలియదు
ఫలితం మాత్రం నేననుభవిస్తున్నాను, నా తప్పేమీ లేకపోయినా!
పోయిన నా కాళ్ళని, రాలిపోయిన నా కలలని
ఈ చిత్రంలో చూసుకుంటున్నాను- అంతకన్నా ఏం చేయగలను?
నన్ను చూసి జాలిపడుతున్నారా? వద్దు
చేతనైతే, దీనికి కారణమైన ద్వేషాన్ని, ఉన్మాదాన్ని ఆపండి!

*****

No comments: