Monday, February 5, 2018

గద్య పూరణము- keywords- అమ్మ, నాన్న

1.    అమ్మ నేర్పిన మంచితనము,
నాన్న నేర్పిన విలువలు చాలు
ఈ ప్రపంచములో బ్రతుకుటకై
వేరు విద్యలు నేర్వ అవసరమా?


2.   అమ్మ, నాన్నల ప్రేమలో పెరిగాను
బయట ప్రపంచంలో ఆ ప్రేమ కోసం వెతికాను
అది దొరకదని నాకు  జ్ఞానోదయమైంది
అందుకే వారి నిస్వార్థ ప్రేమకి అంకితమయ్యాను.

3.   అమ్మ నేర్పిన మంచితనము,
నాన్న నేర్పిన విలువలుండగా
నాకు బయట ప్రపంచంతో సంబంధం ఎందుకు?
గణపతిలా వాళ్ళ చుట్టూ తిరిగేస్తే పోలే?

4.   తప్పు చేసినా క్షమించగలదు
అమ్మ గాక మరెవరు కలరు?
నచ్చకపోయినా మంచే చెప్తారు
నాన్న గాక ఎవరు చేయగలరు?

5.   మీ అమ్మ, నాన్నలని వృద్ధాశ్రమంలో చేర్పించాలా?
అయితే మా వద్దకు తప్పక రండి
మీ దురాలోచనకి గడ్డి పెట్టి
మిమ్మల్ని మరల మనుషుల్ని చేస్తాం!

6.   అమ్మ, నాన్న అనే పదాలలో తీపి
మమ్మీ, డాడీలలో ఎక్కడుంది?
తేటతేనెలోని తియ్యదనం
స్వీటెక్స్ లో వెదికినా దొరకునా?

7.   అమ్మ తక్కువ, నాన్న ఎక్కువ అనే అహంకారీ!
అర్థనారీశ్వర తత్వం తెలుసుకో!
అమ్మను గౌరవించిన వాడే
అర్థాంగిని గౌరవించగలడు మరువకు!

8.   అమ్మ, నాన్నల నుండి తర్ఫీదు పొందాక నేను
ప్రపంచంతో తెగతెంపులు చేద్దామనుకున్నాను
అదే తర్ఫీదు పొందిన నా తోబుట్టువు మాత్రం
లౌక్యం నేర్పలేదని అభాండం మోపాడు!

9.   అమ్మ, నాన్నల్ని ఆశ్రమంలో చేర్పించిన ఒకడు
దేశద్రోహం చేస్తూ పట్టుబడ్డాడట!
మాతృ ద్రోహం తలపెట్టిన వాడు
మాతృ భూమికి ద్రోహం చెయ్యడా!

10.అమ్మ, నాన్న అంటే ఒక అర్హత కాదు
అది ఒక గురుతర బాధ్యత!
దేశ జనాభాని పెంచే ముందు
ఆ బాధ్యత నిర్వర్తించే అర్హత సంపాదించాలి.

11. అమ్మ, నాన్నల పెంపకం విలువ
పిల్లల ప్రవర్తనలో విశదమౌతుంది
పిల్లలు బుద్ధిమంతులైనప్పుడు
అమ్మానాన్నలకు మంచి పేరు వస్తుంది.

*******

No comments: