Saturday, March 10, 2018

గద్య పూరణము- keywords-"అందమైన హరివిల్లులా"

1.     అందమైన హరివిల్లులాంటి ఆమె అందం
ముగ్ధుణ్ణి చేసింది నన్ను
అందాన్ని పోలిన గుణముందని తెలిసినంతనె
నా ఆనందమంటింది మిన్ను!


2.     మూడు పువ్వులారు కాయలుగా
గడిచెను నా యుక్త వయసు
మూడు వక్తృత్వపు పోటీలు, ఆరు వ్యాసరచనలు
అందమైన హరివిల్లులాంటి రోజులన్న అవియెగాదె!

3.     నియాగారా జలపాతమునకేగ
సూర్యరశ్మి కనిపించె అందమైన హరివిల్లులా
ఎండకాయు దినమున  నే జలపాతము జూచిన
కనిపించునది అందమైన హరివిల్లులే కదా!
4.     నీ గదిలో  ఏ రంగు వేయవలెనని నాన్నగారడుగగా
ఏడు రంగులు చెప్పితి నేను అందమైన హరివిల్లులా
ఏడు రంగులు కలిసిన తెల్లరంగు ఎట్టకేలకలంకరించె నా గదిని!
ఇరవై సంవత్సరముల్ గడచిన గాని వారి అంతరార్థము బోధ పడలే!

5.     మోసము లేని సమజమున్న
ఆహా, నిశ్చింతైన హాయి!
అందమైన హరివిల్లులా రోజులు గడువవా
అందరూ మంచివారై మనుగుచుండ!
6.  అందమైన హరివిల్లులా కనబడెనని
మాదక ద్రవ్యముల్ సేవించిన
అంధకారమౌ జీవితము వారికి
కన్నవారికి కడుపు కోతగాక మరేమి?
7. అందమైన హరివిల్లులా బాహ్య సౌందర్యం
క్షణ భంగురము మాత్రమేనని జ్ఞాపకముంచుకొనవలెను
ఈ నిజం గ్రహింపక ఈనాటి యువతీయువకులు

శారీరిక సౌందర్యము కొరకు ప్రాకులడెదరిదేమి మాయో!
***************

No comments: