నేనెంత
కష్టపడినా….
1. ఎవరైనా
అందనివాటికి అర్రులు చాస్తారు కదా!
అలాగే
నేను పండితురాలిననిపించుకుందామనుకున్నాను.
ఒక ముసుగు
వేసుకుని సాహితీ జగత్తులో మెలిగాను.
2. మా
ఇంటిపేరు చెప్పి కాయలమ్మజూశాను
జ్ఞానులు
నాలో ఏదో గొప్పదనముందని భ్రమపడ్డారు
నన్ను వారి
సమూహంలోనికి ఆహ్వానించారు.
3. నా కథల
పేలవత్వం
కవిత్వం
కాని నా తవికలు
పోటీల
నుండి ‘ఢాం’ వార్తలు
4. నా
చేతకానితనాన్ని బయటపెట్టాయి
నా ‘కప్పపాండిత్యా’న్ని
ప్రకటించాయి
నన్ను
సమూహంలో నుండి గెంటేటట్టు చేశాయి.
*****
No comments:
Post a Comment