1.
చిన్నప్పుడు నురుగుతో బుడగలు చేసి ఆ
బుడగల్లో రంగులు చూసి పొంగిపోయాను
కానీ ఆ
బుడగలు క్షణ భంగురాలని తెలుసుకోలేకపోయాను.
2.
వాన పడినప్పుడు కిందకు జారిన నీటి
బిందువులు అలాగే ఉంటాయని ఆశపడ్డాను
అవి క్షణ
కాలంలో నేలతల్లిలో కలిసిపోతే బాధపడ్డాను.
3.
ఆకు చివర నిలిచిన నీటిబిందువుల్లో
ప్రపంచాన్ని చూసి ఆనందించాను
ఆ ఆనందం
తగ్గేలోపలే ఆ బిందువులు ఓడిపోయిన సైనికుల్లా నేలరాలడం చూశాను అదీ క్షణికమైనదని
గ్రహించాను.
4.
పెద్దవుతూండగా బిందువులు నేల రాలడం వెనుక
పరమార్థాన్ని గ్రహించాను
పుడమి
తల్లి పండడానికి ఇదే మార్గమని తెలుసుకున్నాను
ఆ క్షణికమైన
దృశ్యానికి దైవానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
5.
వయసు మీద పడ్డకొద్దీ నేనెవరినన్న ఆలోచన
చేశాను
కళ్ళు
మూసుకుని నాలోని నన్ను పరికించాను.
6.
పరమాత్మ సృష్టిలో నేనూ ఒక బిందువుననన్న
జ్ఞానాన్ని సంపాదించాను
నాలోనే
ప్రపంచమంతటినీ చూశాను
పరమాత్మ మహిమ
తెలిసి ఆనందబాష్పాలు కార్చాను.
****
No comments:
Post a Comment