1. నాకు
సంతోషమొస్తే పట్టలేను
బాధ వస్తే
కృశించిపోతాను
నా మనసు
ఉద్వేగ భరితమైనది.
2. మనిషన్నాక
సుఖ దుఃఖాలుండవూ,
అని
సమర్థించుకునే హేతువాద నైజం నాది
అందరిలా
ఉండాలనుకోవడం మరి తప్పు కాదు కదా!
3. ఈ ఉద్వేగం
నాకు లేని కష్టాలనిచ్చింది
నా రక్త
పోటుని పెంచి, నాకు అనారోగ్యాన్నిచ్చింది
నా జీవితంలో
బాధ ఎక్కువయ్యింది.
4. మనశ్శాంతి
కోసం కొలను వద్దకి వెళ్ళాను
జీర్ణావస్థలో
ఉన్నా కూడా పూలు పూయడం చూసి సంతోషించాను
ఈ
వింతేమిటని ఆలోచించాను.
5. బురదలోంచి పుట్టేది తామర పువ్వు
అయినా ఆ
తామరాకుకి బురదంటదు, నీరూ అంటదు
ఈ నిజం
నాకు జ్ఞానోదయం కలిగించింది.
6. తామరాకు
పైకి బురదా,
నీరు
రెండూ చేరుతాయి
అయినా దానికి
ఆ రెండూ అంటవు.
7. నా
జీవితంలో సంతోషాల నీరూ,
బాధల
బురదా ఉన్నాయి
అయినా
తామరాకు వాటిని అంటకుండా తన జీవితం వెళ్ళదీస్తోందిగా!
8. నేనే
తామరాకులా ఉంటే
నా
ఉద్వేగం పటాపంచలౌతుంది
నా జీవితంలో
స్థితప్రజ్ఞత నెలకొంటుంది.
***
No comments:
Post a Comment