నేను
సబలను
1. ఈ మధ్య
నన్ను భూమిలోకి రాకుండా చంపేస్తున్నారు
ఏం, మా
అమ్మ ఉందిగా, నేనెందుకు బ్రతకకూడదు?
2. నన్ను బడి
దాకా వెళ్ళనిస్తే మీ పుత్రరత్నాల కన్నా బాగా చదువుతా
కానీ మీరు
నన్ను పంపడానికి ఆలోచిస్తారు.
3. కొంత
చదివితే చాలు, పెళ్ళి గురించి ఆలోచిస్తారు
ఇంత బాగా
చదివే నేను ఒక మంచి నిర్ణయం తీసుకోలేనూ?
4. ప్రైవేటు
ఉద్యోగానికెళ్తే నాది ఎక్కువ చాకిరీ, తక్కువ జీతమూను
ఆ మగ
మహారాజులకన్నా నేనెంతో మెరుగైనా, ఎందుకు ఈ ద్వంద్వత్వం?
5. మీ పుత్రరత్నాలు
మిమ్మల్ని చూసినా, చూడకపోయినా
నేనున్నాను
మీకోసమని ఎంతమంది ఆడపిల్లలన్నా మీకు మేము ‘ఆడ’ పిల్లలం, ఎందుకీ వివక్ష?
6. మిమ్మల్ని
పరలోకాలకంపేటప్పుడు తలకొరివి పెట్టే హక్కు నాకు లేదు
మీ ఇంటి
పేరుని నిలబెట్టే హక్కు నాకు ఇవ్వరెందుకు?
7. ఆడపిల్లలని
తక్కువగా చూసే తల్లిదండ్రులారా!
ఇన్ని
సాధించినా, సాధించగలిగినా నేను లోకువేనా?
8. నేను
సబలను
నాకు వంశోద్ధారణ
హక్కు కావాలి.
****
No comments:
Post a Comment