నినాదం- నిజం
“బాల కార్మిక నిషేధం జరగా”లంటూ
నినాదాలు చేస్తే సరిపోతుందా?
మన చేతలలో నిర్మూలించాలి
గాని...
బాలల చేత పనిచేస్తే చౌక
అవుతుందని
మనం ఆశ పడినంత వరకూ
ఈ రక్కసి చేస్తుంది విలయతాండవం!
మనం అందరం బాలలు చదువుకుని
పైకి రావాలని ఆకాంక్షిస్తే,
మన ఇళ్ళలో వారిని పనికి
కుదుర్చుకోకపోతే,
వారిని కన్నవారికి సరైన
దారి చూపిస్తే,
ఆ ఆకాంక్షని చిన్నకారు దుకాణదార్లు
పాటిస్తే,
తివాచీ తయారీలో పిల్లల్ని
దోపిడీ చేయకుంటే,
ఆ నినాదం బాలలకి
నిజమవుతుంది
వారి పాలిట వరమవుతుంది!
*****
No comments:
Post a Comment