ఇదేం వింతో గాని...
నీటి బుగ్గ సలసలా కాగుతోందని అబ్బురపడిపోతాం ...
మన జీవితమే కాగి అవిరవడానికి సిద్ధపడుతోందని గ్రహించం!
కల్పాంతం వరకూ బ్రతికేలా రోజూ కూడబెడతాం, అడ్డొచ్చిన వాళ్ళతో పోట్లాడతాం...
ఈ జీవితం ఓ నీటి బుడగ... ఎప్పుడైనా పుటుక్కుమనగలదని గ్రహించం!
భౌతిక విషయాలమీద మెండైన వ్యామోహం పెంచుకుంటాం...
బుడగ పగిలి ఆవిరవడానికి ఎక్కువ సేపు పట్టదని గ్రహించం!
ఇదేం వింతో గాని...
****
No comments:
Post a Comment