Tuesday, November 14, 2017

చిత్ర కవిత - ఏం లాభం?

ఏం లాభం?
వ్యాపారం చేసుకోవచ్చు, కానీ నైతికత లేనప్పుడు ఏం లాభం?

యాత్రలు నిర్వహించవచ్చు , కానీ నిబంధనలు పాటించనప్పుడు ఏం లాభం?
ఓడ నడప వచ్చు, కానీ ప్రయాణీకుల భద్రత ఏర్పరచలేనప్పుడు ఏం లాభం?
యాత్రలు చేయవచ్చు, కానీ అనుకున్నప్పుడే అన్నీ అవాలంటే ఏం లాభం?
నదీహారతి చూడవచ్చు, కానీ నావ గల్లంతయ్యే త్వర ఉంటే ఏం లాభం?

*****
(this verse was written as a part of a whatsapp writers' group activity)

No comments: