Wednesday, November 22, 2017

చిత్ర కవిత- ఏదీ సంస్కరణ?

ఏదీ సంస్కరణ?
విదేశీయుల దుస్తుల్ని అనుకరించడం మనకు వేలంవెర్రి
మన దుస్తుల్ని అనుకరించడం పాశ్చాత్యులకు వేలంవెర్రి
అనుకరణ తప్పు కాదు, మనం అనుకరించేది సరైన విషయమైతే!

అక్కడ స్త్రీలు ఎలాంటి దుసులు ధరించినా వారికి రక్షణ ఉంది
మరి మన్నదేశంలోనో?
అనుకరిస్తే విదేశాల్లో మంచిని అనుకరించాలి.
మంచీ-చెడూ తేడా తెలియని
ఆ తెలిసీ తెలియని వయసులో
టీవీ అంటే ఆకర్షణ
లిప్ స్టిక్, మేక్ అప్ అంటే గొప్ప
ఈ గొప్ప వల్ల నష్టపోయేది వీరే
వీరొక్కరే కాదు, స్త్రీ జాతి కూడా!
వారి సరదాలకోసం చిన్నపిల్లల
మనస్తత్వాన్నీ,  భవిష్యత్తునీ పణంగా పెడితే
అసలు, వాళ్ళు తల్లిదండ్రులేనా?
మనకి మనమే ఆడపిల్లల్ని చులకన చేసుకుంటే ఎలా?
పీలికల బట్టలేసుకుంటే
ఆదిమ మానవునికి, మనకి ఏది తేడా?
శరీరాన్ని బట్టబయలు చేయడం కాదు అందం
మంచిని, మానవత్వాన్ని వృద్ధి పరిచేదే నిజమైన అందం
ఎవరినైనా కించపరుస్తే అది కాదు నాగరికత
మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచేదే నాగరికత!
అది లోపించినప్పుడు, మనది సభ్య సమాజమా, ఆటవిక ప్రపంచమా?
ఇలాంటి అవమానాలు ఎదురించడానికి ఏమైంది స్త్రీ వాదం?
ఆడపిల్లలని ఇలా చేసి, చూసే సమాజంపై ఏదీ సంస్కరణ?

**************************

No comments: