" ఒక్కసారి
ఆలోచించు బాబూ "
" ఏంటమ్మా
ఆలోచించేది...
పెద్దవారితో ఇలా మాట్లాడ్డం తప్పే కానీ మీకు
సిగ్గూ లజ్జా లేకుండా పోయింది... ఏం మొహం పెట్టుకొని ఈ ప్రతిపాదన నా దగ్గర
తెచ్చావమ్మా "
" అది కాదు కన్నా
"
" ఏంటమ్మా...నాన్నని
కులాంతర వివాహం చేసుకున్నందుకు నిన్ను పుట్టింట్లో అడుగుపెట్టకుండా చేసారు...పాతికేళ్ళుగా
ఒకే ఊళ్ళో ఉంటున్నా మాటామంతీ లేవు...ఎటువంటి సంబంధం లేదు...అలాంటప్పుడు "
"కోరి
వస్తున్నారు కదా..."
" ఏం
మాట్లాడుతున్నావమ్మా... ప్రైమరీ స్కూల్
టీచర్ గా రెండేళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాను...నేను ఎదురుపడగానే మామయ్య ముఖం
త్రిప్పుకుని వెళ్ళిపోతున్నారు...మన కుటుంబాన్ని ఇప్పటివరకు చాలా చిన్నచూపు
చూసారు...
ఈ సమాజంలో గౌరవనీయ స్థానం పొందడానికి కసిగా
నేను చేసిన ప్రయత్నం
ఫలించి గ్రూప్ వన్ పరీక్షల్లో ఎంపికైన విషయం తెలుసుకొని మధ్యవర్తితో వాళ్ళమ్మాయిని
చేసుకోమని రాయబారం పంపితే ఉబ్బితబ్బిబ్బయి పుట్టింటివారి కోరిక తీర్చడానికి తపన
పడిపోతున్నావు..."
నాకు మీ గతి పట్టించద్దు
“అది కాదురా...”
“వీళ్ళు ఆర్థిక సంబంధం కోసం
వచ్చారు...”
“లేదురా.... హార్దికంగానే”..
“సరే... ఓ పని చెయ్యండి....
ఆ అమ్మాయి కోడరికం చేస్తుందేమో కనుక్కో..”
“చిలకా గోరింకల్లా
మీరిద్దరూ నీకు ఏ వూళ్ళో పోస్టింగ్ ఇస్తే అక్కడుండాలి గానీ...”
“అంటే, ప్రేమ పెళ్ళి
చేసుకుని నువ్వూ, నాన్నా అయినవాళ్ళకి దూరమయ్యారు, పెద్దలు కుదిర్చిన పెళ్ళి
చేసుకుని నేనూ అదే గతి పట్టించుకోవాలా?”
“రాలిపోయే ఆకులం ఈ ఊళ్ళో
సొంతింట్లో ఎలాగో కాలం గడిపేస్తాం..”
“నేను గ్రూప్ వన్ కోసం
కష్టపడి చదివింది గౌరవనీయ స్థానం సంపాదించి మన కష్టాలను గట్టెక్కించాలని కానీ, ఓ
గొప్పింటి అల్లుణ్ణైపోదామని కాదు”.
‘”కరెక్టేరా..మరోసారి
ఆలోచిస్తే బాగుంటుందని...”
“చూడమ్మా, మనం ఎన్ని
కష్టాలు పడ్డా, విలువలను విస్మరించలేదు. కోడరికం చెయ్యని ఆ అమ్మాయి, కేవలం నా
ఉద్యోగం చూసి నన్ను చేసుకునే అమ్మాయి, రేపు నన్ను అన్యాయార్జనకి ఉసిగొల్పదని
నమ్మకం ఏమిటి?”
అవతలి పక్క మౌనం.
“వద్దమ్మా వద్దు... నాకు మీ
గతి పట్టించద్దు”, అని ప్రాధేయపడ్డాడు కొడుకు.
ఆ మౌనం
సంపూర్ణాంగీకారమన్నట్టు అతని వీపు మీద నిమిరింది ఆ తల్లి.
*****
No comments:
Post a Comment