Given Story:
ఊడిన పంచె మెడచుట్టూ వేసుకుని వదులైన నిక్కరులాంటి
పంట్లాంతో ఓ బొజ్జాయన వగరుస్తూ...పరుగో పరుగు! అతడిని వెంబడిస్తూ కాలనీలో ఓ
గుంపు...బొజ్జాయన ఏ సందులో దూరినా వెంబడించే గుంపులో జనం పెరుగుతునే ఉన్నారు...కొందరి
చేతిలో పొడుగాటి కర్రలు...మరికొందరి చేతిలో రాళ్ళూ...చోద్యం చూస్తూ
కిటికీల్లోనుండి భార్యామణులు...
పడిలేస్తూ పరిగెడుతూ బ్రతికుంటే మరమరాలు తింటూ రామాకృష్ణా
అని బ్రతుకు లాగించేయవచ్చు అనుకుంటుండగా ఎదురుగా మురికి కాలవ...వెనక్కి
తిరిగిచూసాడు బొజ్జాయన... ఉధృత ప్రవాహంలా కన్నెర్రతో కర్రలతో జనం...
"ధ బే ల్ "
గెంతి
కాలువకు ఆవలి వైపు చేరుకున్నాడు బొజ్జాయన...
ప్రాణ రక్షణ
వేళ...కంపు ఇంపే కదా? !
... కాలువకు ఇటువైపు ఆగిపోయిన గుంపులో గుబురు మీసాల శాల్తీ " మరోసారి
కాలనీ లోకి అడుగుపెట్టావో...నీ అంతు చూస్తాం ...నీ ఊడిన పంచెతో కాలనీ మధ్యలో ఉరి
తీస్తాం జాగ్రత్త " అన్నాడు గాండ్రిస్తూ. సమర్థిస్తూ కర్రలన్నీ
తలలూపాయి...బొజ్జాయన దీనంగా గుంపు వైపు చూస్తున్నాడు...
(requires a twist and a funny ending)
My conclusion:
అసలు కారణం?
బొజ్జాయన తొణకకుండా, “ఛీ,
ఛీ మీలాంటి వాళ్లకి మంచి చేద్దామనుకున్నాను చూడండి... మీ పాట్లు పడండి... పొండెహే”,
అన్నాడు. “ఏమిటేమిటీ, ఒక దొంగ మాకు మేలు చేస్తాడా? దెయ్యం వేదాలు వల్లించడమంటే
ఇదేరా”, అన్నాడొకాయన. బొజ్జాయన విసుగ్గా అటు వెళ్ళిపోవడం మొదలెట్టాడు. “ఆగరా...వివరాలు
చెప్పు”, అన్నాడు దుడ్డు కర్ర పట్టుకున్న ఒకాయన. “ఏమయ్యా సుబ్బయ్యా, మీ ఇంట్లో
తలాడించే తంజావూరు బొమ్మ ఉందా, లేదా?” అడిగాడు బొజ్జాయన. “ఉందనుకో. మా తమ్ముడు
తీర్థయాతర్లకెల్లినప్పుడు తెచ్చాడు. కానీ నీకూ, ఆ బొమ్మకీ ఏటి సంబంధం? నీకీ సంగతి
ఎట్టా తెలిసిందో చెప్పు”, అన్నాడు. “ఇదిగో, వెంకటప్పయ్యా, నీ కొడుకు దగ్గర నాలుగు
బుల్లి కార్లున్నాయా?” అడిగాడు బొజ్జాయన. “అవును... మొన్నీమద్యే కదా కొంట! ఎందుకు
గుర్తుండదు?” ఆశ్చర్యంగా అన్నాడు వెంకటప్పయ్య. ఈ లోగా మరొకరు, “ఇయ్యన్నీ నీకెలా
తెలుసురా బండోడా!” అనడిగారు. “మీరు నన్ను బండోడంటారా? మాటలు తిన్నగా రానీయండి! మా
ఆవిడకి చెయ్యి వాటముంది. నిన్న మీ ఆడంగులతో మాట్లాడినప్పుడు వాటినెత్తుకొచ్చి, పాత
జెంటిల్ మాన్లో శుభశ్రీలా నా దగ్గర గొప్ప చెప్పింది. మీ ఇళ్ళ ఆనవాళ్ళు కనుక్కుని
మీ ఇళ్ళలో గుట్టు చప్పుడు కాకుండా పెట్టేసి పోతుంటే మీరు నన్ను తరుముతారా? నన్ను తోలడం
కాదర్రా! దమ్ముంటే మా ఆవిణ్ణి ఈ కాలనీలోకి రాకుండా ఆపండి చూద్దాం”, అనేసి తన దారిన
కోపంగా వెళ్ళిపోయాడు బొజ్జాయన. అతని మాటలు విన్న వాళ్ళు అవాక్కైపోయారు.
*****
No comments:
Post a Comment