Sunday, October 8, 2017

చిత్ర కవిత- ఎక్కడ?



ఎక్కడ?
మా ఊరు పల్లెటూరంటే అందరూ మూతి ముడుచుకుంటారెందుకో
గడ్డి, గాదం, పేడ, పిడకలు గుర్తొస్తాయందరికీ

గడ్డి తిని ఆవులు బోలెడు పాలిస్తాయి
అవి పాలివ్వకపోతే పట్నవాసులకి బెడ్ కాఫీలెక్కడివి?
ఎరువుల వల్ల అధిక దిగుబడులొస్తాయి
మా మిగులు పంటలు లేనిదే
మరి పట్నవాసులకి తిండెక్కడిది?
మా వూళ్ళో మనుషులు మనుషులతో మాట్లాడతారు
పరికరాలతో కాదు
మరి, ఇటువంటి ఆత్మీయతలు పట్నవాసులకెక్కడివి?
*****

No comments: