మానవులే
చిన్నప్పుడు మనవ జన్మ ఉత్తమ
జన్మని విన్నాను
నిజమేనా, అనే అనుమానం
వస్తోంది.
ఆ దివ్యాంగుణ్ణి ‘వికలాంగు’డని
వేరు చేసేది మానవులే
అతనిలో ఆత్మవిశ్వాసం లేకుండా
చేసేది మానవులే
అతణ్ణి యాచకుణ్ణి చేసింది
కూడా మానవులే
అతనికి హక్కుగా రావలసిన
పింఛను రాకుండా చేసేది మానవులే
అతడి కుటుంబాన్ని ‘పైపు’ పాలు
చేసింది కూడా మానవులే!
వైకల్యం అతని తప్పా? కాదే!
శారీరిక అందానికి
విలువనిచ్చేది మానవులే!
అయినా, వారికి భిన్నంగా
కొందరుంటారు
నోటికో కోటికో ఒక్కరు
పరులకొరకు పాటుపడేవారు,
ధన్య జీవులు
వారొచ్చి ఈ దివ్యాంగుడి కంట
నీరు తుడుస్తారు
అతనికి కావలసిన సాయం
చేస్తారు
అతని ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందిస్తారు.
వారు కూడా కూడా మానవులే!
అటువంటి మానవులే మహనీయులు!
మానవత్వమున్నవీరివల్లే అంటారు పెద్దలు ‘మనవ
జన్మ-ఉత్తమ జన్మ’ని.
******
No comments:
Post a Comment