మా లైట్ హౌస్
మా లైట్ హౌస్ పున్నమి
చంద్రుడి ముందు దివిటీ చూపినట్టున్నా
అదే మా నిత్య పున్నమి
రాత్రి!
గిరగిరా తిరుగుతూ నలు దిశలా
దారి చూపిస్తుంది
మా ఊళ్ళో చిన్న పిల్లలకి
ఉత్సాహం కలిగిస్తుంది.
ఆ వెలుగులోనే మేం ‘లాహిరి
లాహిరి లాహిరిలో’ అని పాడుకునేది
మాకు తోచిన రీతిలో విహార
యాత్ర చేసుకునేది!
చందమామ కనిపించకపోయినా,
మబ్బులు కమ్మినా
సముద్ర యానం చేసేవారికి మా
లైట్ హౌసే దారి చూపే దేవత
వారి క్షేమానికి అదే శ్రీరామరక్ష!
*****
No comments:
Post a Comment