Sunday, October 8, 2017

చిత్ర కవిత - “మంద”బుద్ధి

“మంద”బుద్ధి
మేకలు మందలుగా వెళ్తే అమాయకపు జీవులనుకోవచ్చు
మరి మనుషులు మందలుగా వెళ్తేనో?
కల్లోలం సృష్టిస్తున్నారా?

ఎవరో మగ వారితో పంతం నెగ్గించుకోవడం కోసం
వాళ్ళ స్త్రీలను హింసిస్తున్నారా?
ఎవరికి తెలిసొచ్చింది లెమ్మని
తమతో సంబంధంలేని వాళ్ళ అస్తిపాస్తులపై రాళ్ళు రువ్వుతున్నారా?
అహింసాపూరిత ఆందోళనలు లేనేలేవు.
ప్రభుత్వమంటే మనమేనన్న ఇంగిత జ్ఞానం కోల్పోయారా?
 ప్రభుత్వాస్తులను తగలేస్తున్నారా?
ఇన్ని అనుమానాలొస్తాయి.......
మేకల మందలా చెడ్డ పనులకి తయారయ్యే బదులు
మంచి పనులకి సమీకరించుకుంటే ఎంత మంచి జరుగతుంది?
పరులకు హాని చేయక పోవడం మేకల్ని చూసి నేర్చుకుందాం
మంచి పనులకి సహకరించుకుందాం.....

*****

No comments: