Tuesday, October 17, 2017

చిత్ర కవిత- భాగస్వామ్యం

భాగస్వామ్యం
ఓయీ మగాడిదా! పిల్లల్ని పుట్టించడంలో కాదు
పెంచడంలో లో కూడా పాలు పంచుకో.

ఓయీ స్త్రీద్వేషీ! వాట్సాప్ లోనూ, కంప్యూటర్లోనూ స్త్రీలను అపహాస్యం చేయడం కాదు
వారిని గౌరవించడం నేర్చుకో!
ఓయీ సోంబేరీ! స్త్రీ కష్టం మీద బతకడం కాదు
ఆమె బాధ్యతలను పంచుకో.
ఓయీ మనిషీ! స్త్రీలను తక్కువచేసి గ్రంథాలను వ్రాయడం కాదు
వారు మోస్తున్న భౌతిక, మానసిక భారాల్ని పంచుకో!
స్త్రీకి నేను ఎక్కువని గొప్పకొట్టటం కాదు
ఆమెకు సమాన భాగస్వామివి కా!

*****

No comments: